PV Sindhu: శ్రీవారి సేవలో పీవీ సింధు జంట

ABN, Publish Date - Dec 27 , 2024 | 09:23 PM

PV Sindhu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ(శుక్రవారం) దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ(శుక్రవారం) దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సింధు దంపతులకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సింధు దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. పెళ్లి అయిన తర్వాత స్వామి వారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భావించి ఇక్కడికి వచ్చి దేవుడు ఆశీర్వచనాలు తీసుకున్నామని అన్నారు. తిరుమలలో దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుంటానని అన్నారు. దేవుడు తమను ఎప్పుడు చల్లగా చూడాలని శ్రీవారిని కోరుకున్నామని సింధు దంపతులు పేర్కొన్నారు.


మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 27 , 2024 | 10:14 PM