Pawan Kalyan: అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్
ABN, Publish Date - Dec 28 , 2024 | 08:11 PM
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్యా థియేటర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రిమీయర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.
అమరావతి: హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్యా థియేటర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రిమీయర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అల్లు అర్జున్ రోడ్డు షో చేయడం వల్లే రేవతి చనిపోయిందని అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ‘‘మనుషులు చనిపోతుంటే సినిమాలు ఎక్కువా..? చనిపోతుంటే సినిమా గురించి మాట్లాడతారా..? సినిమాల కంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలి. కొంచెం పెద్ద మనసుతో ఆలోచించండి.. పెద్దగా ఆలోచించండి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 28 , 2024 | 08:12 PM