ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం
ABN, Publish Date - Aug 30 , 2024 | 12:30 PM
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ర్యాంగ్ డ్రైవింగ్ చేసేవారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. ఫైన్ వేసి వదిలేయకుండా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయించారు. నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు.. అనుమతి కోసం రవాణాశాఖకు ప్రతిపాదన కూడా పంపారు.
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ర్యాంగ్ డ్రైవింగ్ చేసేవారికి దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారు. ఫైన్ వేసి వదిలేయకుండా డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయాలని నిర్ణయించారు. నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు.. అనుమతి కోసం రవాణాశాఖకు ప్రతిపాదన కూడా పంపారు. అంతేకాడు.. హెల్మెంట్, సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు రోజూ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. చాలా మంది రూల్స్ పాటించడంలేదు. రైట్ సిగ్నల్ వద్ద ఆగడమూలేదు. రాంగ్ రూట్‌లో వాహనం నడుపుతుంటారు. యూ టర్న్ వద్దంటే అదే తీసుకుంటారు. నో పార్కింగ్ స్థలం వద్ద పార్కింగ్ చేస్తుంటారు. ఇలా కొంతమంది వాహనదారులు చేస్తున్న తప్పుల వల్ల మిగతా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో తప్పుగా డ్రైవ్ చేసినందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ గమనించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇకపై రూల్స్ కఠినతరం చేయాలని నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భార్యకు ప్రేమతో.. 8 అడుగుల స్మృతి చిహ్నం..
యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ పర్యటన..
నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని
ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్ ఫోకస్ ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 30 , 2024 | 12:30 PM