కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ

ABN, Publish Date - Apr 22 , 2024 | 09:12 AM

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి..

హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi Liquor Case)లో అరెస్టయి తీహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కవిత (Kavitha) బెయిల్ పిటిషన్లపై (Bail petitions) సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో విచారణ జరగనుంది. ఈ కేసులో మార్చి 15న కవితను హైదరాబాద్‌లో ఈడీ అరెస్టు చేసి.. 16న రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఇక కోర్టు అనుమతితో రెండు విడతలుగా 10 రోజులు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో మార్చి 26న తీహాడ్ జైలుకు తరలించారు. ఇంతలోనే సీబీఐ రంగంలోకి దిగి కవిత తీహాడ్ జైల్లో ఉండగానే ఈ నెల 11న అరెస్టు చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ సర్కార్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన..

జగన్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్..

సింహాలు కాదు.. పందికొక్కులు!

ఏపీలో అరాచకాలపై వేలు నరుక్కొని నిరసన

నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు

Updated at - Apr 22 , 2024 | 09:29 AM