కెనడా సర్కార్ కీలక నిర్ణయం.. విదేశీయులకు షాక్ ..!

ABN, Publish Date - Dec 25 , 2024 | 09:34 PM

Canada Govt Key Decision : కెనడాలో శాశ్వత నివాసం ఉండాలను కోనే విదేశీయులకు గట్టి షాక్ తగిలింది. ఏదో జాబ్ చూసుకుని హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామనుకొంటే కుదరదని వీదేశీయులకు కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకొనే జాబ్ ఆఫర్ పాయింట్లను సైతం ఎత్తివేసింది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది.

కెనడాలో శాశ్వత నివాసం ఉండాలను కోనే విదేశీయులకు గట్టి షాక్ తగిలింది. ఏదో జాబ్ చూసుకుని హ్యాపీగా ఇక్కడే ఉండిపోదామనుకొంటే కుదరదని వీదేశీయులకు కెనడా ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ విధానం ద్వారా సంపాదించుకొనే జాబ్ ఆఫర్ పాయింట్లను సైతం ఎత్తివేసింది. అయితే వచ్చే ఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. అంటే జాబ్ ఆఫర్ పాయింట్లను బేస్ చేసుకొనే కెనడాలో పర్మినెంట్ రెసిడెన్సీ కోరేందుకు అవకాశం లేకుండా పోతోంది.


ప్రస్తుతం తాత్కాలిక ప్రతిపాదిన ఉద్యోగం చేస్తున్న వారికి సైతం ఈ మార్పులు వర్తిస్తాయని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అభ్యర్థులు ఉద్యోగం పొందినా... అదనపు పాయింట్లు జోడించినా.. శాశ్వత నివాసం కోసం రిక్వస్ట్ చేయలేదని తేల్చి చెప్పింది. ఇప్పటి దాకా పీఆర్ కోసం 50 పాయింట్లు రావాల్సి ఉంది. ఈ విషయంలో మోసాలు చోటు చేసుకొంటున్నాయని కెనడా సర్కార్ గుర్తించింది.దీంతో ఈ వ్యవస్థనే పూర్తిగా ఎత్తివేసింది. ఈ మేరకు రిఫ్యూజిస్ సిటిజన్ షిప్ కెనడా ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Dec 25 , 2024 | 09:35 PM