జెత్వాని కేసు.. కాంతి రానా ఎక్కడ...

ABN, Publish Date - Aug 30 , 2024 | 08:54 AM

అమరావతి: ముంబై సినీ నాటి, డాక్టర్ కాదంబరి జెత్వాని వేధింపుల కేసు వ్యవహారం బయటపడ్డాక విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రానా మూడు రోజుల నుంచి డీజీపీ ఆఫీసుకు హాజరుకావడంలేదు. అంతకుముందు ఆయన తనకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్లినట్లు సమాచారం.

అమరావతి: ముంబై సినీ నాటి, డాక్టర్ కాదంబరి జెత్వాని వేధింపుల కేసు వ్యవహారం బయటపడ్డాక విజయవాడ మాజీ పోలీస్ కమిషనర్ కాంతి రానా మూడు రోజుల నుంచి డీజీపీ ఆఫీసుకు హాజరుకావడంలేదు. అంతకుముందు ఆయన తనకు నచ్చిన సమయంలో వచ్చి వెళ్లినట్లు సమాచారం. పోలీస్ బాస్ ఆదేశాలను లెక్కచేయని వైపీఎస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఫైలు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐపీసీని పక్కనపెట్టి వైసీపీకి జై కొట్టిన కొందరు ఐపీఎస్ అధికారులను ఎన్నికల కమిషన్ ఆ మధ్య పక్కనపెట్టింది. అందులో 16 మంది ఇతరాత్ర కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ప్రతిరోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు వచ్చి ఉదయం 10 గంటలకు సంతకాలు చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్లేముందు రిజిస్టర్‌లో సంతకం చేసి సమయం నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు.


‘జగన్‌ ఆదేశించారు... మేం పాటిస్తాం’ అంటూ అడ్డగోలు పనులు చేసిన పోలీసు అధికారుల చుట్టూ బలంగా ఉచ్చు బిగుస్తోంది. ముంబై నటి, వైద్యురాలు కాదంబరి జెత్వానీని తప్పుడు కేసులో ఇరికించి, ఆమె కుటుంబ సభ్యులనూ అరెస్టు చేసి, అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. రెండు తెలుగురాష్ట్రాలతోపాటు... ముంబైలో, సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. అటు బాధితురాలు కాదంబరి కూడా అప్పటి ఏపీ పోలీసులపై ఈనెల 1వ తేదీనే కేసు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబుకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు... ఆమె నేరుగా విజయవాడకు వచ్చేస్తున్నారు. గురువారం రాత్రి ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కాదంబరి... శుక్రవారం విజయవాడ చేరుకోనున్నారు. ఇక్కడ ఆమె పోలీసులు ఆమె వాంగ్మూలం నమోదు చేస్తారు. అదే సమయంలో తనను వేధించిన ఏపీ ఐపీఎస్‌లపై ఆమె ఫిర్యాదు చేసే అవకాశముంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు విచారణాధికారిగా విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ని నియమించింది. డీజీపీ ఆదేశాల మేరకు విజయవాడ పోలీసు కమిషనర్‌ రాజశేఖర బాబు గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిందితులకు శిక్ష పడాలి: జెత్వాని

ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలపై సర్కార్‌ ఫోకస్‌ ..

యూపీ ప్రభుత్వం కొత్త పాలసీ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 30 , 2024 | 08:54 AM