Share News

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:35 PM

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

జయశంకర్ భూపాలపల్లి, జనవరి 9: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ (Medigadda Barrage) కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఈరోజు (మంగళవారం) కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మహాదేవపూర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులను విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హోస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టారు. పది ప్రత్యేక బృందాలతో దాడులు కొనసాగుతున్నాయి.

విజిలెన్స్ అధికారుల తనిఖీలపై మంత్రి ఉత్తమ్‌కుమార్ మాట్లాడుతూ.. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మేడిగడ్డ కారణాలేంటో తేల్చాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించామని.. మొత్తం 12 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయని ఉత్తమ్ తెలిపారు.


అసలేం జరిగిందంటే...

కాగా.. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కుంగిన వార్త రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడంపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు అందజేశారు. ఇటీవలే మంత్రులు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 09 , 2024 | 02:13 PM