Share News

Huzurnagar: రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం

ABN , Publish Date - Jun 10 , 2024 | 04:01 AM

రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డుల ద్వారా పేదలందరికీ సన్న బియ్యం అందిస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాలుగు నెలల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు.

Huzurnagar: రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం

  • అర్హులందరికీ రేషన్‌ కార్డులు ఇస్తాం: ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, జూన్‌ 9: రాష్ట్రంలో తెల్ల రేషన్‌కార్డుల ద్వారా పేదలందరికీ సన్న బియ్యం అందిస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. నాలుగు నెలల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డితో కలిసి విద్యుత్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, హౌసింగ్‌ బోర్డు శాఖల అధికారులతో హుజూర్‌నగర్‌, కోదాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రైతులు పండించిన సన్న ధాన్యానికి రూ.500లు బోనస్‌ అందిస్తామన్నారు. అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకోవద్దని, బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి జవాబుదారీతనంగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్‌ కొరత లేకుండా చూడాలని, లోవోల్టేజీ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, రైతులకు 24 గంటల విద్యుత్‌ అందించాలని ఆయన అన్నారు.

Updated Date - Jun 10 , 2024 | 04:01 AM