Seethakka: థ్యాంక్యూ.. అక్కా.!
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:01 AM
రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్‌వాడీ ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది.
మంత్రి సీతక్కకు అంగన్‌వాడీ టీచర్ల కృతజ్ఞతలు
హైదరాబాద్, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు తెలంగాణ అంగన్‌వాడీ ఎంప్లాయిస్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. శుక్రవారం ప్రజాభవన్‌లోని ఆమె నివాసంలో యూనియన్ సభ్యులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అంగన్‌వాడీల్లో పనిచేసి పదవీ విరమణ పొందే టీచర్‌కు రూ. 2లక్షలు, ఆయాలకు రూ.లక్ష అందించడంపై ... ‘థ్యాంక్యూ అక్కా’ అంటూ సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్‌ను పరిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు స్వచ్ఛంద పదవీ విరమణ పొందేవారికి కూడా ప్రయోజనాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.