Congres: కేసీఆర్‌కు మరో షాక్.. పార్టీని వీడిన సీనియర్ నేత
ABN , Publish Date - Jul 03 , 2024 | 05:12 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సీనియర్ నేత కే కేశవరావు బీఆర్ఎస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేశవరావును ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు.
ఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కో ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. సీనియర్ నేత కే కేశవరావు (K Keshava Rao) బీఆర్ఎస్ పార్టీని వీడారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేశవరావును ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇంచార్జీ దీపదాస్ మున్షి సమక్షంలో కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఇదివరకే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మరో 20 మంది సిద్ధంగా ఉన్నారని దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే జరిగితే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడం ఖాయం అవుతుంది.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: అమరావతిలో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వం: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News AND Telugu News