Share News

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 19 , 2024 | 10:33 PM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.

TG Politics: అందుకే కవితను అరెస్టు చేశారు.. సత్యవతి రాథోడ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవుతారని బీజేపీ నేతలు చెప్పారన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగానే దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి మాజీ సీఎం కేసీఆర్‌ను వెళ్లకుండా అడ్డుకునే కుట్రతోనే కవితను అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. సమాజంలోని మేధావులు, విద్యావంతులు కవిత అరెస్ట్‌ను ఖండించాలని సత్యవతి రాథోడ్ తెలిపారు.

మోదీ దిగజారి మాట్లాడుతున్నారు: గొంగిడి సునీత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగజారి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత గొంగిడి సునీత(Gongidi Sunita) అన్నారు. కవిత అరెస్ట్‌ను ఖండించారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... కవిత అకౌంట్‌లోకి ఏమైనా డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిందే మోదీ అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను మోదీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలను అణచివేయడానికి వాడుతున్నారని మండిపడ్డారు. ఒక ఆడ బిడ్డ అని కూడా చూడకుండా వదిలిపెట్టలేదన్నారు. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్‌నూ లొంగదీసుకునేందుకేనని ధ్వజమెత్తారు. మోదీ బాధ భరించలేక 14పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టాయని గొంగిడి సునీత చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2024 | 10:33 PM