Share News

EX MLA Muthireddy: యాదగిరి రెడ్డిపై కేసు నమోదు

ABN , Publish Date - Apr 13 , 2024 | 09:27 PM

మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. భూ వివాదంపై బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపెల్లి రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటకోడూరులోని ...

EX MLA Muthireddy: యాదగిరి రెడ్డిపై  కేసు నమోదు

జనగామ: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. భూ వివాదంపై బీఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి కుమారుడు గాడిపెల్లి రాజేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చీటకోడూరులోని తమ స్వంత పట్టా భూమి సర్వే నెంబర్-214 నుంచి జనగామ రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్- 39 లోకి అక్రమంగా తన భూమిలోకి దారి చేసుకున్నాడని ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకు.. తమ కుటుంబ సభ్యలను బెదిరింపులకు గురిచేసి, విదేశాలకు వెల్లకుండా అడ్డుకున్నాడని ఆరోపించారు.


భూ ఆక్రమణకు సంబంధించిన సాక్షాలతో రాజేందర్ రెడ్డి.. నేరుగా ఏసీపీ అంకిత్ కుమార్ శంఖ్వాడ్‌కు ఫిర్యాదు చేశారు. ఏసీపీ ఆదేశాల మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన అనుచరుడు బూరెడ్డి ప్రమోద్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గతంలో యాదగిరి రెడ్డిపై ఆయన సొంత కూతురు తుల్జాభవాని రె.. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉన్న భూమి విషయంలో.. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె ఆరోపణలు చేశారు. ఎకరం ఇరవై గుంటల భూమిని తన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారని తుల్జా భవాని రెడ్డి ఆరోపించారు. ముత్తిరెడ్డిపై సొంత కూతురు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మరో భూ వివాదం కేసు రిజస్టర్ అవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Apr 13 , 2024 | 09:27 PM