Share News

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

ABN , Publish Date - Jun 02 , 2024 | 03:47 AM

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరుగుతుందని వికా్‌సరాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు.

Mahabubnagar: ‘పాలమూరు’ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ నేడే

  • ఏప్రిల్‌ 2వ తేదీనే జరగాల్సి ఉండగా.. వాయిదా

  • తొలి ప్రాధాన్యత ఓట్లతోనే తేలిపోనున్న ఫలితం

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరుగుతుందని వికా్‌సరాజ్‌ తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అభ్యర్థులు తక్కువగానే ఉండటంతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజేత ఎవరో వెంటనే తేలిపోతుందన్నారు. మార్చి 28న ఉప ఎన్నికపోలింగ్‌ జరగగా, ఏప్రిల్‌ 2వ తేదీనే కౌంటింగ్‌ జరగాల్సి ఉంది. అయితే, ఈ ఫలితం ప్రభావం పార్లమెంట్‌ ఎన్నికలపై పడుతుందన్న కోణంలో కౌంటింగ్‌ను జూన్‌ 2కు వాయిదా వేశారు.


5న నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌

నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్‌ ఈ నెల 5న నల్లగొండ సమీపంలోని దుప్పలపల్లిలో జరుగుతుందని తెలిపారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుందని, నాలుగు కౌంటింగ్‌ హాల్స్‌లో 24 టేబుళ్లు ఉంటాయని, మొత్తం 900 మంది సిబ్బంది నియమించామని వివరించారు. ఈ స్థానానికి మొత్తం 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 03:47 AM