Share News

Karimnagar: ఒక సబ్జెక్టులో ఇచ్చిన 4 ప్రశ్నలు.. మరో సబ్జెక్ట్‌ ప్రశ్నపత్రంలో రిపీట్‌

ABN , Publish Date - Jun 08 , 2024 | 05:19 AM

శాతవాహన యూనివర్సిటీ ఎల్‌ఎల్‌బీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక సబ్జెక్టు పేపర్‌లో వచ్చిన నాలుగు ప్రశ్నలు మరో సబ్జెక్టు పేపర్‌లోనూ వచ్చాయి.

Karimnagar: ఒక సబ్జెక్టులో ఇచ్చిన 4 ప్రశ్నలు.. మరో సబ్జెక్ట్‌ ప్రశ్నపత్రంలో రిపీట్‌

  • శాతవాహన వర్సిటీ ఎల్‌ఎల్‌బీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో ఘటన

కరీంనగర్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): శాతవాహన యూనివర్సిటీ ఎల్‌ఎల్‌బీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక సబ్జెక్టు పేపర్‌లో వచ్చిన నాలుగు ప్రశ్నలు మరో సబ్జెక్టు పేపర్‌లోనూ వచ్చాయి. యూనివర్సిటీ పరిధిలో మూడు రోజులుగా ఎల్‌ఎల్‌బీ పరీక్షలు వర్సిటీలోని రెండు పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గురువారం ఫ్యామిలీ లా సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష జరిగింది. శుక్రవారం కాన్‌స్టిట్యూషనల్‌ లా పరీక్ష నిర్వహించారు. ఈ ప్రశ్నపత్రంలో ఫ్యామిలీ లాకు చెందిన మొదటి నాలుగు ప్రశ్నలు మళ్లీ ఇవ్వడంతో విద్యార్థులు అవాక్కయ్యారు.


ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లగా వారు వర్సిటీ పరీక్షా విభాగం అధికారులకు తెలియజేశారు. అప్పటికే అరగంట గడిచింది. తర్వాత తేరుకున్న యూనివర్సిటీ అధికారులు ఫ్యామిలీ లా పేపర్‌లో వచ్చిన నాలుగు ప్రశ్నలకు బదులుగా కాన్‌స్టిట్యూషనల్‌ లాకు సంబంధించిన ప్రశ్నలు మార్చి ఇచ్చారు. అప్పటికే ఆ నాలుగు ప్రశ్నలను రాసిన విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఆ ప్రశ్నలు తప్పుగా ఇచ్చినందుకు గ్రేస్‌టైమ్‌ 25 నిమిషాలు ఇచ్చారు.

Updated Date - Jun 08 , 2024 | 05:19 AM