Share News

Ts News: స్వరం మార్చిన మల్లారెడ్డి.. సీఎం రేవంత్ క్లోజ్ అంటూ కామెంట్స్

ABN , Publish Date - Feb 01 , 2024 | 02:32 PM

మాజీమంత్రి, ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన దోస్త్ అని.. మంచి క్లోజ్ అని సెలవిచ్చారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని వివరించారు.

 Ts News: స్వరం మార్చిన మల్లారెడ్డి.. సీఎం రేవంత్ క్లోజ్ అంటూ కామెంట్స్

హైదరాబాద్: మాజీమంత్రి, ఫైర్ బ్రాండ్ మల్లారెడ్డి (Malla Reddy) స్వరం మార్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ నాటి పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డిపై తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు టోన్ మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన దోస్త్ అని.. మంచి క్లోజ్ అని సెలవిచ్చారు. గురువారం నాడు మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని వివరించారు. త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తానని స్పష్టంచేశారు. రేవంత్‌తో సమావేశం సానుకూలంగా జరుగుతుందని విశ్వాసంతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని కలలో కూడా అనుకోలేదని వివరించారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఊహించలేదని పేర్కొన్నారు. ఓటమి షాక్ నుంచి ఇంకా తేరుకోలేమని వివరించారు. మల్కాజిగిరి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని తనను కేటీఆర్ అడిగారన్నారు. తన కుమారుడు భద్రారెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటున్నానని స్పష్టంచేశారు.

కాంగ్రెస్‌లోకేనా..?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మల్లారెడ్డిపై కేసు నమోదైంది. గిరిజనుల భూమి కబ్జా చేశారని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయ్యింది. మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో సర్వే నంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది. దానిపై భూమి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నడుస్తుండగా మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తనకు క్లోజ్ అని కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో భూ కబ్జాలు, బ్రోకర్ పనులు చేశావని రేవంత్ రెడ్డి ఆరోపించగా.. మల్లారెడ్డి తోడగొట్టి మరి సవాల్ విసిరారు. ఎన్నికలు జరిగి అధికార మార్పిడి జరిగింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఓ కేసు నమోదైంది. ఇంతలో రేవంత్‌ తనకు దోస్త్ అంటున్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 01 , 2024 | 02:51 PM