Share News

TS NEWS: సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

ABN , Publish Date - Jan 07 , 2024 | 05:56 PM

జిల్లాలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సీజ్ చేశారు. గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.

TS NEWS: సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

సంగారెడ్డి జిల్లా: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని కంకోల్ టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు సీజ్ చేశారు. గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మద్యం సీసాలు దొరికాయి. ఇద్దరు డ్రైవర్లను ఎక్సైజ్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు హెచ్చరించారు.

Updated Date - Jan 07 , 2024 | 05:56 PM