Share News

Barrelakka Marriage: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..

ABN , Publish Date - Mar 28 , 2024 | 05:24 PM

Barrelakka Marriage: సోషల్ మీడియా, తెలంగాణ పాలిటిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష(Shirisha) పెళ్లిపీఠలెక్కింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం(Marriage) చేసుకుంది. నాగర్ కర్నూలు(Nagarkurnool) జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్‌లో..

Barrelakka Marriage: సందడే సందడి.. వెంకటేష్‌తో బర్రెలక్క ఏడడుగులు..
Barrelakka Marriage

Barrelakka Marriage: సోషల్ మీడియా, తెలంగాణ పాలిటిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క(Barrelakka) అలియాస్ శిరీష(Shirisha) పెళ్లిపీఠలెక్కింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వివాహం(Marriage) చేసుకుంది. నాగర్ కర్నూలు(Nagarkurnool) జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పీఎంఆర్ గార్డెన్‌లో తన సమీప బంధువైన వెంకటేష్‌ను వివాహం చేసుకుంది శిరీష. ఈ పెళ్లికి శిరీష బంధుమిత్రులు సహా, తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు, ఎన్నికల సమయంలో ఆమె అండగా నిలిచిన విద్యార్థి నాయకులు, మేధావులు హాజరయ్యారు. శిరీష పెళ్లి వేడుకకు సంబంధించి పోటోలు, వీడియోలు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Also Read: ఇంటికి వెళ్తున్నా.. మళ్లీ వస్తానో.. రానో తెలియదు

నిరుద్యోగ సమస్యతో సతమతం అవుతూ.. ఉపాధి కోసం బర్రెలను కాయాల్సి వస్తోందంటూ సోషల్ మీడియాలో చేసిన ఒక్క పోస్టుతో శిరీష ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అలా శిరీష కాస్తా బర్రెలక్కగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన బర్రెలక్క.. ఆ తరువాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత, మేధావులు, ఇతర ప్రముఖులు సైతం సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో ప్రచారం కోసం ఫైనాన్షియల్‌గా కూడా అండగా నిలిచారు. అలా ఒంటరి పోరుతో అందరి దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క.. ఇవాళ వివాహ బంధంతో జంటగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 28 , 2024 | 05:51 PM