Share News

Barrelakka: ఇంటికి వెళ్తున్నా.. మళ్లీ వస్తానో.. రానో తెలియదు

ABN , Publish Date - Dec 16 , 2023 | 03:34 PM

Barrelakka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఓటమి తర్వాత తొలిసారిగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌తో ఎమోషనల్‌గా మాట్లాడారు.

Barrelakka: ఇంటికి వెళ్తున్నా.. మళ్లీ వస్తానో.. రానో తెలియదు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్క సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచారు. కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఓటమి తర్వాత తొలిసారిగా ఆమె ఓ వీడియో చేసి పోస్ట్ చేయగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను ఎన్నికల్లో నిలబడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే అని.. అంతకుముందు వరకు తాను హాస్టల్‌లోనే ఉన్నానని.. కానీ ఇప్పుడు హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్తున్నానని బర్రెలక్క చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి హాస్టల్‌లోనే ఉన్నానని.. కాంపిటేషన్ పరీక్షలకు ప్రిపేర్ అయిన సమయంలో కూడా హాస్టల్‌లోనే ఉన్నట్లు ఆమె తెలిపారు.

కానీ ఇప్పుడు ఎన్నికల లెక్కలు చేసుకోవాల్సి ఉండటంతోనే ఇంటికి వెళ్తున్నానని బర్రెలక్క వెల్లడించారు. ఇలా హాస్టల్ ఖాళీ చేయడం తనకు చాలా బాధగా ఉందని.. మళ్లీ వస్తానో రానో తెలియదని భావోద్వేగానికి గురయ్యారు. 2021 నుంచి ఇప్పటివరకు తాను ఒకే హాస్టల్‌లోనే ఉన్నానని బర్రెలక్క స్పష్టం చేశారు. హాస్టల్‌లో తనకు ఇంట్లోనే ఉన్న వాతావరణం ఉంటుందని.. ఫుడ్ కూడా చాలా బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా తన వీడియోలో హాస్టల్‌ను బర్రెలక్క చూపించారు. ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపిన వాళ్లకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 03:38 PM