Share News

KTR: ప్రజాపాలన కాదు.. గలీజు పాలన..

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:21 AM

రాష్ట్రంలో కాంగ్రె్‌సది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని.. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ సర్కారు ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసి గలీజుపాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

KTR: ప్రజాపాలన కాదు.. గలీజు పాలన..

  • కాంగ్రెస్‌ తీరు మారకపోతే జనం తరిమికొట్టడం ఖాయం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రె్‌సది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని.. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని ఈ సర్కారు ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసి గలీజుపాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నల్లగొండ మునిసిపాలిటీలోని పాతబస్తీ హిందూపూర్‌ వాటర్‌ ట్యాంకులో మృతదేహం లభించడంపై సోమవారం ట్విటర్‌ ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. జలమే జగతికి మూలమని, మిషన్‌ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటి ట్యాంకుల నిర్వహణ కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు.


‘కోతల్లేని కరెంట్‌ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్‌ ట్యాంకులను పట్టించుకోరు చివరికి.. నల్లగొండలోని నీటి ట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు’ అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నాగార్జున సాగర్‌ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్‌ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యంకనబడుతోందని, ఈ సర్కారు తీరుమారకపోతే జనం తరిమికొట్టడం ఖాయమని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 04 , 2024 | 04:21 AM