Share News

Ponguleti: పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఒక్క సీటు గెలవనీయబోం

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:40 PM

బీఆర్ఎస్(BRS) వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును గెలవనీయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) హెచ్చరించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి తీరుతామని.. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ఇందిరమ్మ రాజ్యం అన్నారు.

 Ponguleti: పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీని ఒక్క సీటు  గెలవనీయబోం

భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్(BRS) వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటును గెలవనీయబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) హెచ్చరించారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి తీరుతామని.. ఇది దొరల ప్రభుత్వం కాదు.. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. గురువారం నాడు కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ...ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వ దోపిడీ, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 హామీలను అమల్లోకి తీసుకువచ్చామని తెలిపారు.

ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

మహిళలకు మహాలక్ష్మి హామీలో భాగంగా ఉచిత బస్సు, రూ.10 లక్షల మెడికల్ బీమా, రూ.500 గ్యాస్, రూ.200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. మూడు నెలల్లో 25 వేల ఉద్యోగాలు, మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ వేశామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం, పేపర్ లీకేజీలు లేని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల వైఫల్యాలపై శ్వేతపత్రాల్లో అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వ అవినీతిని బహిరంగ పరిచామని అన్నారు. తాము కాళేశ్వరం వెళ్తే కేసీఆర్ దుర్భాషలాడారని.. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు నిత్యం సీఎం సహా ప్రతి మంత్రి అందుబాటులో ఉంటామని అన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారని.. ప్రధాని పదవి చేపడతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి...

TS Politics: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్

Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్లేందుకు కారణమిదే...?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...

Updated Date - Feb 29 , 2024 | 05:40 PM