Share News

Ramoji Rao: రామోజీ మృతి పట్ల కేసీఆర్, హరీశ్, కేటీఆర్ సంతాపం

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:56 AM

ప్రముఖ మీడియా నిపుణులు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు(87)(Ramoji rao) మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటు రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

Ramoji Rao: రామోజీ మృతి పట్ల కేసీఆర్, హరీశ్, కేటీఆర్ సంతాపం
KCR and Harish rao, KTR condolence to Ramoji

ప్రముఖ మీడియా నిపుణులు, రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు(87)(Ramoji rao) మృతి పట్ల తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్(KCR) దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటు రామోజీ కుంటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు(Harish rao) కూడా రామోజీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, టీవీ, సినిమా రంగాల్లో రామోజీ సేవలతో ఎంతో మందికి ఉపాధి లభించిందని గుర్తు చేశారు. దీంతోపాటు రామోజీ శ్రమ, తపన, నిబద్ధత, క్రమ శిక్షణ కల్గిన మంచి వ్యక్తి అని హరీశ్ రావు పేర్కొన్నారు.


దీంతోపాటు బీఆర్ఎస్ నేత, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్(KTR) కూడా రామోజీ మృతి పట్ల సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. రామోజీ గారి మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డానని ఆయన నిజమైన దార్శనికుడని అభివర్ణించారు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఎన్నో అసమానతలు ఉన్నప్పటికీ గొప్ప విజయాన్ని ఎలా సాధించవచ్చో ఆయన జీవితం, ప్రయాణం చూస్తే అర్థమవుతుందన్నారు.

ఈ క్రమంలో తెలుగు మీడియా, వినోద ప్రపంచంలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేశారు. గత దశాబ్దంలో నేను చాలాసార్లు సంభాషించే అవకాశాన్ని పొందానని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నట్లు ప్రకటించారు.


రామోజీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్‌(hyderabad)లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రామోజీ భౌతికకాయాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల ఇప్పటికే ప్రధాని మోదీ సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి


Narendra Modi: రేపు ఈ సమయంలోనే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. భారీగా భద్రతా ఏర్పాట్లు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 10:59 AM