Home » Ramoji Group
ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత దివంగత రామోజీరావు ఓ అక్షర శిఖరమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అచంచలమైన విశ్వాసంతో..
కృష్ణా జిల్లా కానూరు(Kanuru) వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు(Ramoji Rao) సంస్మరణ సభ నిర్వహణపై మంత్రుల కమిటీ సమీక్ష నిర్వహించింది. సచివాలయం 3వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ హాజరయ్యారు.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబసభ్యులను మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రామోజీరావు మరణించిన సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం సీడబ్ల్యూసీ, పార్టీ ఇతర సమావేశాల్లో పాల్గొనాల్సి ఉండడంతో పార్థివ దేహాన్ని చూసేందుకుగానీ, అంత్యక్రియలకు గానీ హాజరు కాలేకపోయారు.
బంధుమిత్రుల అశ్రునయనాలు.. ప్రముఖులు, సన్నిహితుల నివాళుల నడుమ.. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ ఉదయం 9గంటలకు రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్‌గా, దిగ్గజ వ్యాపారవేత్తగా, సినీ నిర్మాతగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగించిన రామోజీరావుది సాధారణ మధ్య తరగతి రైతు కుటుంబం. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామానికి చెందిన చెరుకూరి
రామోజీరావులో అందరూ గాంభీర్యాన్ని చూస్తే నేను మాత్రం ఆయనలోని చిన్నపిల్లాడిని చూశా. నేను 2009లో ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి సలహాల కోసం ఆయన్ను తరచూ కలిసేవాడిని.
రామోజీరావు గారి మరణం దిగ్ర్భాంతి కలిగించింది. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయనను కలవాలనుకున్నాను. ఈలోపే ఇలా జరిగింది.