Share News

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి

ABN , Publish Date - Jun 08 , 2024 | 07:41 AM

చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తి.

Ramoji Rao: అక్షర శిల్పి రామోజీకి ఘన నివాళి
Ramoji Rao

హైదరాబాద్: చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియోను నిర్మించిన దిగ్గజం. 2016లోనే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ అందుకున్న మహోన్నత వ్యక్తి.


ఆయన జ్ఞాపకార్థమే రామయ్య అని పేరు పెట్టారట..

రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 16న రైతుకుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు. ఇతనికన్నా ముందు ఇద్దరు అక్కలు ఉన్నారు. పెద్దక్క పేరు రాజ్యలక్ష్మి, చిన్నక్క పేరు రంగనాయకమ్మ.


బాల్యం, విద్యాభ్యాసం, వివాహం (1937 - 1961)

రామోజీ శ్రీ వైష్ణవ కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లి ఆచార సంప్రదాయాలతో పాటు నిత్యం భగవంతుడి ధ్యానంలో ఉండేవారు. తల్లి నుంచే రామోజీకి సైతం భక్తి, శుచి అలవడింది. లేక లేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని చాలా ముద్దు చేసేవారు. పెద్దక్క పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయినా చిన్నక్క రంగనాయకమ్మతో సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటి పనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా ‘రామోజీ రావు’ అన్న పేరును తనకు తానే పెట్టుకున్నారు. రామోజీరావు గుడివాడ కళాశాలలో ఇంటర్, బీఎస్సీ చదివారు. 1961 ఆగస్టు 19న రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య, వాణీదేవిల రెండవ కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది. రామోజీరావుతో భార్య వైపు బంధువుల్లో చిన్న బావమరిది తాతినేని వెంకట కృష్ణారావు మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థలో డైరెక్టరుగా, తోడల్లుడు ముసునూరు అప్పారావు ఈనాడు, డాల్ఫిన్స్ హోటల్స్ మాజీ ఎండీగా కలసి పనిచేశారు.

Updated Date - Jun 08 , 2024 | 09:01 AM