Share News

BJP.. కరీంనగర్: బండి సంజయ్ నేడు రైతు దీక్ష

ABN , Publish Date - Apr 02 , 2024 | 07:41 AM

కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద రైతు దీక్ష చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు.

BJP.. కరీంనగర్: బండి సంజయ్ నేడు రైతు దీక్ష

కరీంనగర్: రైతు సమస్యల పరిష్కారం కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద రైతు దీక్ష (Farmer initiation) చేపట్టనున్నారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, పంట నష్టం పరిహారం చెల్లింపుపై దీక్ష చేయనున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్ష చేస్తారు.

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govt.) ఇప్పటి వరకు పరిహారం అందించలేదని, సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవటం లేదని బండి సంజయ్‌ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, తక్షణమే వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ మేరకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ కేంద్రం వద్ద ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ‘రైతు దీక్ష’ చేపడతామని ప్రకటించారు. వడ్ల కల్లాల వద్ద బస చేసి.. రైతులు పడుతున్న బాధలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలిస్తామని పేర్కొన్నారు. రైతు సంఘాలు, ప్రజా సంఘాలు తన దీక్షకు సంఘీభావం తెలపాలని కోరారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, 2-3 రోజుల్లో ప్రణాళికను వెల్లడిస్తామన్నారు.

రైతుల పక్షాన బీజేపీ డిమాండ్లు ఇవే..

తాలు, తేమ, తరుగుతో సంబంధం లేకుండా వడ్లను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులతోపాటు కౌలు రైతులుకు ఎకరాకు రూ.15 వేలు, భూమి లేని వ్యవసాయ కూలీలలకు రూ.12 వేలు ఇవ్వాలి. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులతో అనుసంధానించాలి. రైతు కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. సమగ్ర పంటల బీమాను అమలు చేసి రైతులతోపాటు రైతు కూలీలు, భూమిలేని రైతులకు సైతం బీమా పథకాన్ని వర్తింపజేయాలి. కొత్త సాగు విధానంతోపాటు పంటల సమగ్ర ప్రణాళికను విడుదల చేయాలి.

Updated Date - Apr 02 , 2024 | 07:43 AM