TS News: కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రౌచర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:13 PM
హైదరబాద్‌లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. బుధవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది.

హైదరబాద్‌లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. బుధవారం ఉదయం 10:30 గంటలకు ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పాల్గొని ప్రసంగంలో రూపంలో తమ అభిప్రాయాలను తెలిపారు. కమ్మ సామాజిక వర్గం గురించి అనేక కీలక విషయాలు వెల్లడించారు. కమ్మ నాయకులు గతంలో సమాజానికి చేసిన, ప్రస్తుతం చేస్తోన్న సేవ, కృషి గురించి చెప్పుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో కమ్మవారు అనేక రకాల సేవలు చేశారని గుర్తు చేసుకున్నారు. విదేశాల్లోనూ చాలామంది కమ్మవారు స్థిరపడ్డారని చెప్పారు. అమెరికా వంటి దేశాల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. ఆయా దేశాల అభివృద్ధిలో కమ్మవారు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లోనూ కమ్మవారు తమ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తారని చెప్పారు. అంతేకాకుండా కమ్మవారికి ఎలాంటి కష్టం వచ్చిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ బ్రౌచర్ ద్వారా ఆదుకుంటామని నేతలు హామీ ఇచ్చారు. అయితే కొందరు కమ్మవారిని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఈ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.