Share News

Kishan Reddy: నాంపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన... అధికారులపై ఆగ్రహం

ABN , Publish Date - Jan 29 , 2024 | 10:10 AM

Telangana: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఈరోజు (సోమవారం) నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు.

Kishan Reddy: నాంపల్లిలో కిషన్‌రెడ్డి పర్యటన... అధికారులపై ఆగ్రహం

హైదరాబాద్, జనవరి 29: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) ఈరోజు (సోమవారం) నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మల్లేపల్లి డివిజన్ అఘాపురలో పవర్ బోర్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. అయితే పలు సమస్యలకు సంబంధించి అధికారులపై కిషన్‌రెడ్డి సీరియస్ అయ్యారు. గత ఆరు నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ కేంద్రమంత్రికి స్థానికులు ఫిర్యాదు చేశారు. నవంబర్‌లో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బస్తీ వాసులు వాపోయారు. దీంతో గత ఆరు నెలలుగా ఎందుకు చేయలేదని అధికారులపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని అధికారులు చెప్పడంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మల్లేపల్లి డివిజన్ అఘాపురలో వెంటనే స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు కిషన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 29 , 2024 | 10:10 AM