Share News

Breaking: నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..

ABN , Publish Date - Mar 06 , 2024 | 03:58 PM

TSPSC Exam Dates : తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్‌ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల..

Breaking: నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్ 1, 2, 3 పరీక్షల తేదీలు ఖరారు..
TSPSC Exam Dates

TSPSC Exam Dates : తెలంగాణ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. టీఎస్‌పీఎస్‌సీ(TSPSC) కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్‌ను(Exam Schedule) ఖరారు చేసింది టీఎస్‌పీఎస్‌సీ. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌సీ తాజాగా ఎగ్జామ్ షెడ్యూల్‌ను ప్రకటించింది.

టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన ప్రకారం..

అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.

ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2.

నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించనున్నారు.

కాగా, 563 గ్రూప్ 1‌ పోస్టులుండగా.. 783 గ్రూప్ 2, 1388 గ్రూప్ 3 పోస్టులను భర్తీ చేయనుంది టీఎస్‌పీఎస్‌సీ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 06 , 2024 | 03:58 PM