Share News

TSPSC: నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్‌పీఎస్సీ సంచలన ప్రకటన..

ABN , Publish Date - Feb 19 , 2024 | 05:55 PM

TSPSC Group 2 Notification: తెలంగాణ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను(Group 1 Notification) రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.

TSPSC: నిరుద్యోగులకు అలర్ట్.. టీఎస్‌పీఎస్సీ సంచలన ప్రకటన..
TSPSC Cancels Group-1 notification

TSPSC Group 2 Notification: తెలంగాణ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను(Group 1 Notification) రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. గతంలో టీఎస్‌పీఎస్‌సీ 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. పలు కారణాల రిత్యా ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. కాగా, త్వరలోనే కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. త్వరలోనే రానున్న నోటిఫికేషన్‌లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 19 , 2024 | 05:55 PM