Share News

Telangana: విద్యార్థులకు కీలక అలర్ట్.. ఆ నిబంధన ఎత్తివేసిన ఇంటర్ బోర్డు..

ABN , Publish Date - Mar 01 , 2024 | 08:46 PM

తెలంగాణ ఇంటర్ ( Inter ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. వి

Telangana: విద్యార్థులకు కీలక అలర్ట్.. ఆ నిబంధన ఎత్తివేసిన ఇంటర్ బోర్డు..

తెలంగాణ ఇంటర్ ( Inter ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనను తొలగించింది. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్ ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు పరీక్ష ప్రారంభమయ్యాక నిమిషం లేట్ అయినా విద్యార్థులు పరీక్ష రాయడానికి అధికారులు అనుమతించలేదు. తాజా నిర్ణయంతో విద్యార్థులకు కాస్త వెసులుబాటు కలిగినట్లైంది.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్‌ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్‌లకు సూచించారు.


కాగా.. పరీక్ష రాసేందుకు నిమిషం ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలుడు సూసైడ్ చేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. అందుకే ఒక్క నిమిషం నిబంధనను ఎత్తివేసినట్లు సమాచారం. అయితే.. విద్యార్థులు మాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, సమయానికే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 09:17 PM