Share News

AP Police: వీళ్లకేం పోయేకాలం.. హైదరాబాద్‌లో ఆంధ్రా పోలీసుల పాడుపని..!

ABN , Publish Date - Feb 02 , 2024 | 11:44 AM

Telangana: సమాజంలో చెడును నిర్మూలించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట నిత్యం గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతూ పోలీసులకు పెను సవాల్‌ను విసురుతూనే ఉన్నాయి.

AP Police: వీళ్లకేం పోయేకాలం.. హైదరాబాద్‌లో ఆంధ్రా పోలీసుల పాడుపని..!

హైదరాబాద్, ఫిబ్రవరి 2: సమాజంలో చెడును నిర్మూలించడానికి పోలీసులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. డ్రగ్స్, గంజాయి ఇలా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంత చేసినప్పటికీ ఎక్కడో ఒక చోట గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు పోలీసులకు పెను సవాల్‌ను విసురుతూనే ఉన్నాయి. అయితే గంజాయి బ్యాచ్‌ను పట్టుకోవాల్సిన పోలీసులే ఆ వ్యాపారానికి పాల్పడితే?... ఖాకీ దుస్తులు ధరించి ఇలాంటి నీచమైన పనులకు దిగితే?... ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. ఖాకీ వృత్తిలో ఉంటూ గంజాయి దందాకు తెరతీశారు ఇద్దరు ఏపీ పోలీసులు.. రహస్యంగా గంజాయి తరలించేందుకు యత్నించి చివరకు పక్క రాష్ట్ర పోలీసులకు చిక్కారు ఆ ఖాకీలు.

అసలేం జరిగిందంటే?..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు పోలీసులు గంజాయి అమ్ముతూ తెలంగాణ పోలీసులకు చిక్కారు. ఈరోజు (శుక్రవారం) బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్‌వోటీ బాలానగర్ పోలీసులు ఓ వాహనాన్ని పట్టుకున్నారు. AP 39 QH 1763 నెంబర్ గల మారుతీ ఈసీవో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా.. 11 పాకెట్స్‌లో 22 కేజీల గంజాయి పట్టుబడింది. వాటి విలువ రూ.8 లక్షలు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారి వివరాలు తెలిసి పోలీసులు షాక్‌కు గురవ్వాల్సి వచ్చింది. పట్టుబడిని ఇద్దరు వ్యక్తులు ఏపీ పోలీసులుగా గుర్తించారు.

ఏపీ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా కాకినాడలోని థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్( 35) , కానిస్టేబుల్ శ్రీనివాస్ (32 ) అని తెలిసింది. గంజాయి స్మగింగ్‌తో పెద్ద ఎత్తున్న డబ్బు సంపాదించవచ్చనే ఆశతో సదరు ఖాకీలు ఈ దందాకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం బాగోలేదని వంకతో డ్యూటీకి సెలవు పెట్టి మరీ మొదటిసారి గంజాయి స్మగ్లింగ్ చేస్తూ చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన ఏపీ పోలీస్‌శాఖలో దుమారాన్ని రేపింది. పోలీసన్నా... ఇదేం పని అన్నా అంటూ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 02 , 2024 | 03:41 PM