TG News: హిమాయత్ నగర్‌లో పాము కలకలం..
ABN , Publish Date - Jun 07 , 2024 | 07:30 PM
భాగ్యనగరంలోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో తాచు పాము కలకలం సృష్టించింది. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము ప్రత్యేక్షమైంది. అక్కడి నుంచి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పౌల్ వద్దకు పాము వెళ్తున్న దృశ్యాన్ని వావానదారులు తమ సెల్‌ఫోన్లలో క్లిక్‌మనిపించారు.

హైదరాబాద్: భాగ్యనగరంలోని హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో తాచు పాము కలకలం సృష్టించింది. లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై పాము ప్రత్యేక్షమైంది. అక్కడి నుంచి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పౌల్ వద్దకు పాము వెళ్తున్న దృశ్యాన్ని వావానదారులు తమ సెల్‌ఫోన్లలో క్లిక్‌మనిపించారు.
పాము ప్రత్యక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేశారు. దీంతో కొంతపేపటి వరకు ట్రాఫిక్ జాం నెలకొంది. కార్యాలయాల నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో అటువైపు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాదచారులు కూడా తమ ఫోన్‌లలో పాము వీడియోను తీసుకున్నారు. అయితే అక్కడున్న ట్రాఫిక్ పోలీసులు స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించడంతో వారు పామును పట్టకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలి వేసినట్లు సమాచారం.