Share News

ACB: గొర్రెల స్కామ్.. 2వ రోజు కస్టడీ విచారణ..

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:43 AM

హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ లో గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవరోజు మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, ఓఎస్డీ కళ్యాణ్‌లను విచారిస్తున్నారు.

ACB: గొర్రెల స్కామ్.. 2వ రోజు కస్టడీ విచారణ..

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో గొర్రెల స్కామ్ (Sheep Scam) దర్యాప్తులో ఏసీబీ అధికారులు (ACB Officers) స్పీడ్ (Speed) పెంచారు. నిందితులను ఏసీబీ అధికారులు కస్టడీ (Custody)లోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండవరోజు మంగళవారం మాజీ పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ నాయక్, ఓఎస్డీ (OSD) కళ్యాణ్‌ (Kalyan)లను విచారించనున్నారు.


మొదటిరోజు సోమవారం కస్టడీ విచారణలో రామచందర్.. నోరు మెదపలేదు. అలాగే ఓఎస్డీ కళ్యాణ్ కూడా విచారణకు సహకరించలేదు. గొర్రెల స్కీము యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయంపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎవరి ప్రమేయంతో దళారి, భోగస్ కంపెనీతో గొర్రెలను రైతులకు కొనుగోలు చేసి ఇవ్వాలని ఆదేశించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. రామచందర్, కళ్యాణ్‌లను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఈరోజు కస్టడీ విచారణలో రాజకీయ నాయకుల పాత్ర, ఓఎస్డీ కళ్యాణ్‌ ఫైల్స్ తరలింపు, కాల్చివేత వీటన్నింటిపై ఏసీబీ అరా తీస్తోంది.


కాగా జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పశు సంవర్ధక శాఖ మాజీ ఎండీ రామ్ చందర్ నాయక్.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లను మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో సోమవారం వారిని కస్టడీలోకి తీసుకుని అధికారులు విచారించారు.


కాగా గొర్రెల స్కామ్‌లో ఇప్పటికే 10 మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్ట్ చేశారు. గొర్రెల స్కామ్‌లో మొదట రూ. 2.10 కోట్లు దారి మళ్ళినట్టు గుర్తించారు. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామ్ చందర్ నాయక్ , ఓఎస్డీ కళ్యాణ్ అరెస్ట్‌తో రూ.700 కోట్ల స్కామ్ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించింది. కస్టడీ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్ మోహినూద్దిన్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 11 , 2024 | 11:46 AM