Share News

GK Deshpande: డీఆర్‌టీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది జీకే దేశ్‌పాండే

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:31 PM

డీఆర్‌టీ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు(drt bar association elections) గురువారం పోటాపోటీగా జరిగాయి. హైదరాబాద్‌ త్రివేణి కాంప్లెక్స్‌ అబిడ్స్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది జీకే దేశ్‌పాండే, ప్రస్తుత అధ్యక్షుడు బీ సంజయ్ కుమార్(sanjay kumar) అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు.

 GK Deshpande: డీఆర్‌టీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది జీకే దేశ్‌పాండే

డీఆర్‌టీ బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు(drt bar association elections) గురువారం పోటాపోటీగా జరిగాయి. హైదరాబాద్‌(hyderabad) త్రివేణి కాంప్లెక్స్‌ అబిడ్స్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది జీకే దేశ్‌పాండే, ప్రస్తుత అధ్యక్షుడు బీ సంజయ్ కుమార్(sanjay kumar) అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగగా, 5.30 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. వీరిలో జీకే దేశ్‌పాండే(GK Deshpande)కు ఎక్కువ ఓట్లు రావడంతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు.

11.jpg

కౌంటింగ్‌లో జీకే దేశ్‌పాండేకి 24 ఓట్లు రాగా, సంజయ్ కుమార్‌కి 23 ఓట్లు వచ్చాయి. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో జీకే దేశ్‌పాండే ఒక ఓటు మెజారిటీతో విజయం సాధించడం విశేషం. అలాగే ఉపాధ్యక్ష పదవికి ఎన్‌వి సుబ్బరాజు, జీ పూర్ణిమ పోటీ చేయగా.. సుబ్బరాజు విజయం సాధించారు. మరోవైపు కె. కళ్యాణ్ చక్రవర్తి సంయుక్త కార్యదర్శిగా, అడ్రియన్ కిరణ్ రాజ్ కోశాధికారిగా, టీ రణధీర్ సింగ్ లైబ్రేరియన్‌గా ఎన్నికయ్యారు. ఎ. నరేష్, జే నరేందర్, శ్రవణ్ కుమార్ రాగి ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపికయ్యారు.

drt election.jpg


ఈ ఎన్నికలో ప్రధాన కార్యదర్శి పదవికి డీ రాఘవులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ కార్యదర్శి సీహెచ్ కిషోర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జీ పుష్కళ, పీ రాజేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 49 మంది సభ్యులలో 47 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో సీనియర్ న్యాయవాది బీ శ్రీనివాస్ రెడ్డి, అభయ్ సింగ్, పీఎస్ఎన్ రవీంద్ర ఉన్నారు. ఫలితాల వెల్లడి అనంతరం బార్ సభ్యులు అందరూ విజేతలుగా నిలిచిన పోటీదారులను అభినందించి, మిఠాయిలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వానికి సహకరించిన సభ్య న్యాయవాదులందరికీ డీఆర్‌టీ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన జీకే దేశ్‌పాండే కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాదుల సంక్షేమానికి, బార్ అసోసియేషన్ గౌరవాన్ని, ఉన్నతమైన వృత్తిని నిలబెట్టేందుకు తన పదవీ కాలంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

22.jpg

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: PM Modi: ప్రధాని మోదీ-బిల్ గేట్స్ చాయ్ పే చర్చ.. వీటిపైనే ప్రధానంగా చర్చ

Updated Date - Mar 29 , 2024 | 12:34 PM