Share News

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:51 AM

Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్,

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..
Ram Navami Shobha Yatra

Happy Ram Navami 2024: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో(Ram Navami in Hyderabad) భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారం బాగ్(Sitaram Bagh) నుంచి కోటీ వ్యాయామశాల(Koti) వరకు శోభాయాత్ర(Ram Navami Shobha Yatra) నిర్వహించనున్నారు. ఈ శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీస్‌తో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్, దూల్‌పేట్ మీదుగా జాలి హనుమాన్, పురానాపూల్, జుమేరిత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటీ వ్యాయామశాల వరకు శోభయాత్ర జరుగనుంది.

ట్రాఫిక్ ఆంక్షలు..

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. శోభాయాత్ర రూట్లలో కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచించారు. కాగా, శోభయాత్ర రూట్‌లో 25 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. ఇదిలాఉంటే.. శోభాయాత్ర మధ్యాహ్నం 12:11 నిమిషాలకు ప్రారంభం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 08:51 AM