Share News

Surprise Checks: హైదరాబాద్ పబ్స్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:59 AM

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Surprise Checks: హైదరాబాద్ పబ్స్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
Police Checkings

హైదరాబాద్: నగరంలోని పబ్స్‌ (Pubs)లో పోలీసులు (Police) ఆకస్మిక తనిఖీలు (Surprise Checks) చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ (Madhapur Police Station) పరిధిలోని పబ్స్ (Pubs), బార్స్‌ (Bars)లో న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrations) దృష్టిలో పెట్టుకుని సోదాలు చేశారు. పబ్స్, బార్స్‌లో డ్రగ్స్ సరఫరా చేసినా.. మైనర్లను అనుమతించినా చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కాగా నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్స్, బార్స్‌పై నిఘా ఉంచారు. ఈ క్రమంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్స్, బార్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్‌వోటి, మాదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అనుమతులు ఎంత వరకు ఉన్నాయన్న దానిపై ఆరా తీశారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసినట్లు తమ దృష్టికి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డాగ్ స్క్వాడ్ తో ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. సౌండ్ పొల్యూషన్‌తో పాటు సౌండ్ ప్రూఫ్ కూడా మెయింటైన్ చేయాలను పబ్ యజమానులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని పబ్ యజమానులకు సూచించారు. ఎట్టి పరిస్థితిలలో డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలను అనుమతించిన కఠిన చర్యలు వుంటాయని మరోసారి హెచ్చరించారు.


కాగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కోదాడ మండలం, నల్లబండగూడెం వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ల్యాబ్ పరీక్షల అనంతరం డ్రగ్స్ వివరాలు వెల్లడిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.



కాగా న్యూ ఇయర్‌ వేడుకలకు యువతను, ఆహూతులను ఆకర్షించడానికి పబ్‌లు, క్లబ్‌లు, రిసార్టుల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో దేశవిదేశాల నుంచి నగరానికి ఖరీదైన మద్యంతో పాటు రకరకాల మాదకద్రవ్యాలు కూడా కొందరు గుట్టుగా సరఫరా చేస్తుంటారు. పార్టీ ప్రియులను మత్తులో ముంచేసి భారీగా కూడబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పటికే రంగంలోకి దిగిన స్మగ్లర్స్‌.. గంజాయి, డ్రగ్స్‌ వంటి మాదక ద్రవ్యాలను నగరానికి దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పాత ముఠాల ఆటకట్టిస్తుండటంతో కొత్త స్మగ్లర్స్‌ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి ముఠాలను గుర్తించి అడ్డుకట్ట వేయడానికి హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ న్యూ), తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో (టి- న్యాబ్‌) అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

న్యూ ఇయర్‌ వేడుకలను లక్ష్యంగా చేసుకొని స్మగ్లర్స్‌ గుట్టుగా నగరానికి గంజాయి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్మగ్లర్స్‌ ఒడిశా నుంచి నగరానికి 21 కిలోల గంజాయిని రహస్యంగా తెచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు మొత్తం ఆరుగురు నిందితులను ఇటీవల అరెస్టు చేశారు. నిందితుల్లో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, ఒడిశాకు చెందిన ఇద్దరు ఉన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ నిర్వాకంతో నీటిలోనే నానుతున్న ర్యాప్ట్ ఫౌండేషన్

పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 12:01 PM