Share News

Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , Publish Date - Apr 01 , 2024 | 02:02 PM

హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్పా మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మేల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు.

Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం (KCR Family) తప్పా మిగతా నేతలందరూ కాంగ్రెస్‌ (Congress)లో చేరడానికి సిద్దంగా ఉన్నారని, తమ పాలన చూసే ప్రతిపక్ష ఎమ్మేల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్ వద్ద మీడియాతో చిట్ చాట్‌(Chit chat)గా మాట్లాడారు. నల్గొండ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP)లకు డిపాజిట్ (Deposit) కూడా రాదన్నారు. 14 ఎంపీ సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ (Election Code) తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు (White Ration Cards) ఇస్తామని స్పష్టం చేశారు.


ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేసిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని, వంద శాతం తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ వెనక ఎంత పెద్ద నాయకులు ఉన్నా శిక్ష పడుతుందన్నారు. కూతురు కవిత ఒక కేసులో ఇరుక్కుపోయిందని, గొర్రెల స్కాంలో కొందరు ఇరుక్కుపోయారని, ఇక ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఇరుకుతారోనని బీఆర్ఎస్ వాళ్ళకి భయంగా ఉందన్నారు. రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, తెలంగాణలో తాగునీటి సమస్య, కరెంట్ సమస్య లేదని చెప్పారు. కేసీఆర్‌లా ఫామ్ హౌజ్‌లో పండుకునే అలవాటు తమకు లేదన్నారు. ప్రతి రోజూ సచివాలయానికి వస్తున్నామని, ప్రతి సమస్యపై వారం.. పదిరోజులకొకసారి రివ్యూ చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దాబాయింపు చేశారని, బీఆర్ఎస్‌కు మళ్లీ అధికారం కల్ల అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.


కేసీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రతి మాట అబద్దమే అని.. ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిన్న కేసీఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడారు అని అనిపించిందన్నారు. ఒడిపోవడమే కాదు, పార్టీ మిగలదు అనే భయం కేసీఆర్‌లో మొదలైందన్నారు. పొంగనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని.. ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మిగలదని అన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ అని.. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Apr 01 , 2024 | 02:34 PM