Share News

Ramoji Rao: అక్షరయోధుడికి అంజలి

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:51 AM

మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘రామోజీ రావు పేదల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు.

Ramoji Rao: అక్షరయోధుడికి అంజలి
Ramoji Rao

హైదరాబాద్: మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు (Ramoji Rao) మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘రామోజీ రావు పేదల పక్షపాతి అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు. ‘అలు పెరుగని అక్షర యోధుడు. జనహితమే తన అభిమతంగా అనుకున్నారు. జీవితాంతం నిబద్ధతతో పనిచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు స్ఫూర్తితో పనిచేశారు అని’ నారా లోకేశ్ అభిప్రాయ పడ్డారు.


రామోజీ రావు మృతిపై హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ‘తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటం లేని మహారాజు. పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారు. చిత్రసీమలో అదేవిధంగా వెలిగిచారు. తెలుగు నేలపై అతిపెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. తన తండ్రి ఎన్టీఆర్‌తో రామోజీరావుకు ప్రత్యేక అనుబంధం ఉండేది. రామోజీ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని’ నందమూరి బాలకృష్ణ అభిప్రాయ పడ్డారు.

Updated Date - Jun 08 , 2024 | 11:43 AM