Share News

MLC Kavitha: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ భట్టికి కవిత లేఖ

ABN , Publish Date - Feb 05 , 2024 | 02:23 PM

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ రాష్ట్ర హోం మంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమం కోసం 20 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పిస్థామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు.

MLC Kavitha: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ భట్టికి కవిత లేఖ

హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ రాష్ట్ర హోం మంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. బడ్జెట్‌లో బీసీ సంక్షేమం కోసం 20 వేల కోట్లు కేటాయించాలని పేర్కొన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్దత కల్పిస్థామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లల్లో లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని కవిత పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్లతో జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు నిర్మిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చారన్నారు. వీటన్నంటిని అమలు చేయాలని లేఖలో కవిత స్పష్టం చేశారు.

Updated Date - Feb 05 , 2024 | 02:23 PM