Share News

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:34 PM

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందని జీవో 3 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరా పార్క్ వద్ద భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నారు.

MLC Kavitha: ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం..

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల్లో (Government Jobs) మహిళలకు (Womens) అన్యాయం జరుగుతోందని జీవో 3 (GO3) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇందిరా పార్క్ (Indira Park) వద్ద భారత్ జాగృతి అధ్యక్షురాలు (Bharat Jagruti Chief), ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha) ఆధ్వర్యంలో ధర్నా (Dharna) చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారత్ జాగృతి శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు పోలీస్ శాఖలో కల్పిస్తున్నామన్నారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని, జీవో 3 తీసుకొచ్చి ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

జీవో 3 వల్ల మహిళలకు కేవలం 12 శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు అన్యాయం జరిగే ఈ జీవోపై అవసరం అయితే సుప్రీం కోర్టుకైన వెళ్ళాలని కవిత పిలుపుపిచ్చారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy Govt.) మారుతోందన్నారు. పీజీటీ (PGT), జెఎల్ (JL) పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలను కలవటం లేదని కేసీఆర్‌ను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ప్రజలకు కనడపడం లేదని ప్రశ్నించారు. ఆయన ఢిల్లీ నేతలనే కలుస్తారని.. ఇక్కడ ప్రజలను కలవరని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 01:34 PM