Share News

Kavitha: బీసీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం

ABN , Publish Date - Jan 30 , 2024 | 09:50 PM

బీసీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు.

Kavitha: బీసీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం

హైదరాబాద్: బీసీ హక్కుల కోసం సుదీర్ఘ పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు కవితను బీసీ సంఘాల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... తెలంగాణ బీసీ హక్కుల కోసం యునైటెడ్ పూలే ఫ్రంట్ (UPF) ఆవిర్భావించిదని తెలిపారు. భారత జాగృతి సమన్వయంతో యునైటెడ్ పూలే ఫ్రంట్‌ను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు. బీసీ సంఘాలు, మేధావులు, ప్రజాసంఘాలతో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

ఫిబ్రవరి నెల రెండో వారంలో ఇందిరా పార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ మహాధర్నాకు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు, ప్రజాసంఘాలకు ఆహ్వానం పంపినట్లు తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో పూలే యునైటెడ్ ఫ్రంట్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో అన్ని జిల్లాల్లో ఫ్రంట్ కమిటీల నిర్మాణం చేస్తామని అన్నారు. పూలే విగ్రహం సాధన ఆరంభం మాత్రమేనని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:01 PM