Share News

Minister Prabhakar: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి

ABN , Publish Date - Feb 05 , 2024 | 10:10 PM

మేడారం అతి పెద్ద ఉత్సవమని.. జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. సోమవారం నాడు మేడారం లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు.

Minister Prabhakar: మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి

ములుగు: మేడారం అతి పెద్ద ఉత్సవమని.. జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తెలిపారు. సోమవారం నాడు మేడారం లో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన పిబ్రవరి 13వ తేదీన సమ్మక్క వనం నుంచి జనం లోకి వచ్చారని తెలిపారు.జాతీయ ఉత్సవానికి అన్ని అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయన్నారు. జాతీయ ఉత్సవంగా జరుపుకుంటే దేశానికే గర్వకారణమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు పద్నాలుగున్నార కొట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.జాతరకు వచ్చే మహిళలకు కూడా ఉచితంగా ప్రయాణం ఉంటుందని తెలిపారు.

ఇప్పుడు కూడా ప్రతి రోజూ జాతరకు వచ్చే లక్ష 20 వేల మంది ప్రయాణం చేస్తే 70 వేల మంది ఆర్టీసీలో ప్రయాణం చేసిన వారే ఉన్నారన్నారు. 10 ఎకరాల స్థలం అదనంగా ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎండీ సజ్జనర్ ఆధ్వర్యం లో బస్ షెల్టర్లు , క్యూ లైన్‌లు, ఆర్టీసీ క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. వీఐపీలు భక్తులకు ఇబ్బందులూ లేకుండానే రావాలన్నారు. మేడారం జాతరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Updated Date - Feb 05 , 2024 | 10:10 PM