Jupalli Krishnarao: పండగ పూట ప్రెస్‌మీట్ పెట్టాల్సి వచ్చింది.. కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్
ABN , Publish Date - Jan 15 , 2024 | 02:30 PM
Telangana: పండుగ రోజున ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ కల్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... డిసెంబర్‌లో కొల్లాపూర్‌లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారన్నారు.
హైదరాబాద్, జనవరి 15: పండుగ రోజున ప్రెస్‌మీట్ పెట్టాల్సిన పరిస్థితి మాజీ మంత్రి కేటీఆర్ (former Minister KTR) కల్పించారని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... డిసెంబర్‌లో కొల్లాపూర్‌లో మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి తన బంధువుల చేతిలో హత్యకు గురయ్యారన్నారు. వ్యక్తిగత కారణాల వలన, భూ తగాదాలతో హత్య జరిగిందని తెలిపారు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు తెర మీదికి ఆ హత్యను ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు.
హంతకులను శిక్షిస్తామమని... కొందరు ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉన్నారన్నారు. 1999 నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో తన మెజార్టీ పెరుగుతూ వస్తుందన్నారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి బీజేపీ సానుభూతి పరుడని.. కానీ ఎన్నికల ముందు ఆయన బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..