Share News

KTR: బీఆర్ఎస్ నిజమైన సెక్యూలర్ పార్టీ

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:28 PM

బీజేపీ( BJP ) తో పొత్తు గతంలో లేదని.. భవిష్యత్‌లో ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

KTR: బీఆర్ఎస్ నిజమైన సెక్యూలర్ పార్టీ

హైదరాబాద్: బీజేపీ( BJP ) తో పొత్తు గతంలో లేదని.. భవిష్యత్‌లో ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీ టీం కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలను, ఇద్దరు ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఓడించింది. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. బీఆర్ఎస్‌కు బీజేపీ బీ టీం అయితే ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా? కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్ప బీజేపీతో సంబంధాలు కారణం కాదు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలని చూశాయి. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కవడం వల్లే రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు వేర్వేరుగా ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం రేవంత్ రెడ్డి కలవగానే ఎమ్మెల్సీ ఉపఎన్నికల పద్ధతి మారింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికల తీరుపై హైకోర్టుకు వెళ్లినా మాకు నిరాశ తప్పలేదు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోంది. మొన్నటి ఎన్నికల్లో మేము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్లమేమో. బీజేపీ వాళ్లు పొలిటికల్ హిందువులు అయితే ..కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువు. బీఆర్ఎస్ నిజమైన సెక్యూలర్ పార్టీ. ఇక ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదు. పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే పద్ధతి ఉంటుంది’’ అని కేటీఆర్ తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 10:28 PM