Share News

KP Vivekananda Goud: సీఎం రేవంత్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు

ABN , Publish Date - Jan 21 , 2024 | 10:07 PM

సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు అసహ్యించు కుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ( KP Vivekananda Goud ) ఆరోపించారు.

KP Vivekananda Goud: సీఎం రేవంత్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ( KP Vivekananda Goud ) ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మల్కాజిగిరిలో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నామన్నారు. తమ విజయంలో కేటీఆర్ ముద్ర ఉందని.. మంత్రిగా కేటీఆర్ నగర అభివృద్ధికి చూపిన ప్రత్యేక చొరవ ఈ ఫలితాలకు నిదర్శనమన్నారు. మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ చేసిందేమీ లేదన్నారు. హామీల గురించి అడిగితే మంత్రులు వారి స్థాయిని మరచి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీలను గుర్తు చేస్తే తమను బెదిరించేలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజలను మోసగించడానికే కాంగ్రెస్ అలవి కాని హామీలు ఇచ్చిందని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ పేరు చెప్పి హామీలను కాంగ్రెస్ ఎగవేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దావోస్‌లో రేవంత్ ఓ సీఎంలా వ్యవహరించలేదని ఎమ్మెల్యే వివేకానంద మండిపడ్డారు.

Updated Date - Jan 21 , 2024 | 10:08 PM