Share News

ABN - Andhrajyothy: ప్రణీత్ రావ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

ABN , Publish Date - Mar 15 , 2024 | 12:11 PM

Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ప్రణీత్ ‌రావు ఉన్నారు. కాగా.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి చిక్కిన ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. పలువురు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని అధికారులు విచారించారు. ప్రణీత్ రావు కేసులో 6 గురు సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు.

ABN - Andhrajyothy: ప్రణీత్ రావ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్, మార్చి 15: ఫోన్ ట్యాపింగ్ కేసులో (phone tapping case) మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును (Fprmer DSP Praneeth Rao) పోలీసులు అరెస్ట్ చేయగా.. నాంపల్లి కోర్టు (Nampally Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ప్రణీత్ ‌రావు ఉన్నారు. కాగా.. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) చిక్కిన ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. పలువురు ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని అధికారులు విచారించారు. ప్రణీత్ రావు కేసులో 6 గురు సభ్యులతో స్పెషల్ టీంను ఏర్పాటు చేశారు. ఐఓగా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఉన్నారు. టీంలో సభ్యులుగా బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట ఇన్స్పెక్టర్లతో పాటు ఇద్దరు పంజాగుట్ట ఎస్సైలు ఉన్నారు. ప్రణీత్ రావు నుంచి మూడు సెల్ ఫోన్లతో పాటు ఒక లాప్టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రణీత్ రావు మూడు రకాలుగా నేరానికి పాల్పడినట్లు గుర్తించారు.

సాక్షాలు చెరిపివేత, పబ్లిక్ ప్రాపర్టీ డామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ టాంపరింగ్ నేరాలకు ప్రణీత్ పాల్పడ్డారు. 17 సిస్టంల ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఫోన్ టాపింగ్ కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్‌‌ను ప్రణీత్‌కు కేటాయించినట్లు తెలుస్తోంది. రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్‌ను మానిటర్ చేసిన ప్రణీత్.. సేవ్ చేసుకున్న రికార్డ్స్ మొత్తాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్‌లో కాపీ చేసుకునే వాడు. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకే హార్డ్ డిస్క్‌లను తొలగించేశాడు. పాత హార్డ్ డిస్క్‌లను కట్టర్లు ఉపయోగించి డిస్మాటిల్ చేశాడు. డిసెంబర్ 4 రాత్రి పాత హార్డ్ డిస్క్‌లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేశాడు. సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని ఎన్నికల ఫలితాల రోజు చెరిపేశాడని.. పాత హార్డ్ డిస్క్‌ల పేరుతో కొత్త హార్డ్ డిస్క్‌ను అమర్చినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి...

Crocodile: వామ్మో.. మొసలి రోడ్డుపైనే సంచారిస్తోందిగా...

Lok Sabha Polls 2024: బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం.. బీఎస్పీకి ఏయే స్థానాలు కేటాయించారంటే?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 15 , 2024 | 12:44 PM