Share News

Janareddy: చాలా సంతోషంగా ఉంది... రేవంత్ ప్రభుత్వంపై జానారెడ్డి ప్రశంసలు

ABN , Publish Date - Jan 26 , 2024 | 02:45 PM

Telangana: రేవంత్ రెడ్డి సర్కార్ నెలరోజుల పాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. ఈనెలరోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చింది.

Janareddy: చాలా సంతోషంగా ఉంది... రేవంత్ ప్రభుత్వంపై జానారెడ్డి ప్రశంసలు

హైదరాబాద్, జనవరి 26: రేవంత్ రెడ్డి సర్కార్ నెలరోజుల పాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ముందుకు సాగుతోంది. ఈనెలరోజుల్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చింది. అలాగే మిగిలిన ఐదు గ్యారెంటీలను వీలైనంత త్వరగా ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇదిలా ఉండగా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెల రోజుల పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నెలరోజుల పాలన చూస్తుంటే.. సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం.. ప్రజా పాలన ఒరవడితో ముందుకు వెళుతోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉందన్న భావన కల్పిస్తుందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని.. మేధావులు, ప్రజాసంఘాల, పార్టీల సలహాలు.. సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. రేవంత్ ప్రభుత్వం.. గత పరిస్థితులను వివరిస్తూ, సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు రాత్రింబవళ్ళు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.


ఆనాడే చెప్పా.. అదే నిజమైంది..

‘‘ఈ ప్రజాపాలనలో నా వంతు పాత్ర నిర్వహిస్తాను. గతంలో నేను నాయకత్వం వహించినప్పటికీ.. ఇప్పుడు పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను. నా పనితీరు ప్రతీకార్యకర్తకు ఆదర్శంగా ఉండేలా పనిచేస్తా. నా అనుభాన్ని, సలహాలను ప్రభుత్వానికి, ప్రజలకు ఇవ్వడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. బీఆర్ఎస్ ప్రభుత్వంపై నేను పదేళ్ల కింద చెప్పినవే ఇప్పుడు నిజమయ్యాయి. అప్పులు, హామీలు, సంస్కారం, ప్రజాస్వామ్యం, పతకాలపై గత ప్రభుత్వాన్ని.. నేను అనాడే హెచ్చరించాను. అప్పులు, విద్యుత్ కొనుగోళ్ళు భవిష్యత్‌కు ప్రమాదమని నేను చెప్పింది నేడు నిజమైంది’’ అని అన్నారు.

సోనియమ్మకు కానుకగా ఇద్దాం...

కాంగ్రెస్ ప్రభుత్వంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నాను. కాంగ్రెస్‌ను గెలిపించి.. ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడానికి ప్రతి కార్యకర్త చేసిన కృషి అద్వితీయమని కొనియాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచేలా.. ఇదే స్పూర్తితో పనిచేయాలన్నారు. అత్యధిక స్థానాలు గెలిచి సోనియా గాంధీకి కానుకగా ఇద్దామన్నారు. ప్రజలందరికీ జానారెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 26 , 2024 | 05:11 PM