Jagdish Reddy: దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Jan 12 , 2024 | 10:38 PM
సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ( Jagdish Reddy ) అన్నారు.

హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ( Jagdish Reddy ) అన్నారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ హయంలో సంక్షేమానికి ఇన్ని అడ్డంకులు లేవని చెప్పారు. కేసీఆర్ కొంత మంది కార్యకర్తలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. తప్పుడు కేసుల బాధితులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ హక్కుల సాధనలో రాజీ పడబోమని చెప్పారు. పార్లమెంట్‌కు పోటీ చేసే అభ్యర్థులను కేసీఆర్ చర్చించి నిర్ణయిస్తారని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.