Share News

TS News: అరబ్ కంట్రీలో హైదరాబాదీకి వరకట్న వేధింపులు.. ఈ అమ్మాయి బాధ ఎవ్వరికీ రావొద్దు..

ABN , Publish Date - Mar 09 , 2024 | 10:50 AM

హైదరాబాద్ అమ్మాయి.. అరబ్ కంట్రీలో నానా అగచాట్లు పడుతోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ కంట్రీకి చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం చేశారు. కట్నం తేలేదంటూ సబా బేగమ్‌ను భర్త చిత్ర హింసలు పెడుతున్నాడు. ఆ అమ్మాయి అక్కడ పడుతున్న కష్టం.. ఎవ్వరికీ రాకూడదు. కనీసం తిండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్‌తో ఆమెను భర్త చితకబాదాడు.

TS News: అరబ్ కంట్రీలో హైదరాబాదీకి వరకట్న వేధింపులు.. ఈ అమ్మాయి బాధ ఎవ్వరికీ రావొద్దు..

కూతురు దర్జాగా బతకాలని ఏ తల్లిదండ్రులకుండదు? అదే ఆలోచనతో మక్కాకు చెందిన వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు. కోటి ఆశలతో భర్తతో కలిసి మక్కాలో అడుగు పెట్టిన ఆ యువతికి నిత్యం నరకమే.. దినదిన గండంలా మారిపోయింది పరిస్థితి. కామ వాంఛ తీర్చుకోవడం.. ఆపై చిత్ర హింసలు పెట్టడం. ఒళ్లంతా గాయాలైన స్థితిలో కూతురు ఉన్న వీడియో తల్లిదండ్రుల కంట పడింది. అంతే ఆ తల్లి గుండె పగిలింది. కాపాడాలంటూ విదేశాంగశాఖను లేఖ ద్వారా వేడుకుంటోంది ఆ అమ్మ మనసు.

హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) అమ్మాయి.. అరబ్ కంట్రీలో నానా అగచాట్లు పడుతోంది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన సబా బేగంని అరబ్ కంట్రీ (Arab Country)కి చెందిన ముక్తాదీర్ అనే వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం చేశారు. కట్నం తేలేదంటూ సబా బేగమ్‌ను భర్త చిత్ర హింసలు పెడుతున్నాడు. ఆ అమ్మాయి అక్కడ పడుతున్న కష్టం.. ఎవ్వరికీ రాకూడదు. కనీసం తిండికూడా పెట్టకుండా ఓ గదిలో బంధించి రబ్బర్ మ్యాట్‌తో ఆమెను భర్త చితకబాదాడు.

TS BJP: కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్

తన కామ వాంఛ తీర్చుకున్నాక ప్రతి రోజు దాడికి పాల్పడుతున్నాడు. గది నుంచి బయటకు రాకుండా.. కిటికీలన్నీ క్లోజ్ చేసి గదికి తాళం వేశాడు. సబాకు ఒళ్లంతా దెబ్బలే. కనీసం ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు కూడా ఆ కసాయి భర్తకు మనసు రాలేదు. తన కూతురుని కాపాడాలంటూ విదేశాంగ మంత్రికి తల్లి లేఖ రాసింది. అరబ్ కంట్రీ మక్కాలో ఉంటున్న తన‌ కూతురిని భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ లేఖలో పేర్కొంది. భర్త నుంచి తన కూతురని ఎలాగైనా కాపాడాలని కోరింది. కనీసం తన కూతురుతో మాట్లాడ నివ్వడం లేదట. ఒళ్లంతా గాయాలవడంతో రక్తస్రావమై ఎక్కడికక్క గడ్డలు కట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఎలాగో తల్లిదండ్రులకు సబా బేగం పంపిచడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

TS Politics: బీఆర్ఎస్ పార్టీకి వరస షాక్‌లు.. క్యాండిడేట్స్ లేక ఉద్యమ పార్టీ విలవిల!!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 09 , 2024 | 10:50 AM