Share News

TS High Court: అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన జీఓల విషయంలో హైకోర్టు ఆగ్రహం

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:00 PM

అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన జీఓల విషయంలో తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్మికశాఖ కమిషనర్, ప్రిటింగ్ ప్రెస్ కమిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు పెంచుతూ 2022 జూన్‌లో జీఓలు విడుదల చేసింది.

TS High Court: అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన జీఓల విషయంలో హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన జీఓల విషయంలో తెలంగాణ హైకోర్టు ( Telangana High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్మికశాఖ కమిషనర్, ప్రిటింగ్ ప్రెస్ కమిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపించింది. అసంఘటిత రంగ కార్మికులకు వేతనాలు పెంచుతూ 2022 జూన్‌లో జీఓలు విడుదల చేసింది. ఏడాదిన్నర దాటినా జీఓలను గెజిట్‌లో ప్రింట్ చేయలేదని హైకోర్టులో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆరు వారాల్లోపు జీఓలను గెజిట్‌లో ప్రింట్‌ చేయాలని గతేడాది అక్టోబర్‌ 10వ తేదీన హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటి వరకు జీఓలు ప్రింట్ చేయలేదని మరోసారి ధర్మాసనం దృష్టికి చిక్కుడు ప్రభాకర్ తీసుకెళ్లారు. దీనివల్ల దాదాపు 47లకల మంది అసంఘటిత రంగ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు కావడం లేదని చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది. ఈకేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jan 05 , 2024 | 11:00 PM