Share News

KTR: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్..

ABN , Publish Date - Jan 09 , 2024 | 04:50 PM

Telangana: అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారన్నారు.

KTR: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్..

హైదరాబాద్, జనవరి 9: అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. మంగళవారం ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తమ పోరాట పటిమ చూశారన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ (BRS Chief KCR) అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు.

కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే డేంజరస్ అని అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారన్నారు. పార్లమెంటు నియోజక వర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజక వర్గాల సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 09 , 2024 | 04:50 PM